KTR:బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజాపక్షమే

15
- Advertisement -

100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్…అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మందిని బీఆర్ఎస్ పార్టీ చూసిందని,మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలామంది నీలిగిన్రు
అయినా రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, నీలాంటి వాళ్ళను మట్టికరిపించిందన్నారు.

తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్… తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా… మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయని,రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడని…రేవంత్ రక్తం అంతా బీజేపీదే…ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండన్నారు.గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నారని, స్విట్జర్లాండ్ లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నాడన్నారు.అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లొగుట్టు బయటపెట్టాలని..రాహుల్ గాంధీ ఏమో అదానీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే… ఈరోజు రేవంత్ రెడ్డి ఆదాని కోసం అర్రులు చాస్తున్నారన్నారు.

డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండని,ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దని,స్వయంగా ముఖ్యమంత్రి…. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలన్నారు. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలని, సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పిండన్నారు.

బీఆర్ఎస్ కేసీఆర్ అద్వర్యంలో 36 ప్లైఒర్లు కడితే, ఉప్పల్, అంబర్ పేట ప్లై ఒవర్లు సంవత్సరాలైనా కట్టలేక చేతులెత్తెశారన్నారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు అన్నారు. కేసీఆర్ నాయకత్వానికి అపూర్వమైన మద్దతు ఇచ్చిన హైదరాబాద్ నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. రాష్ట్రంలో బీజేపిని అడ్డుకున్నది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే… బీఆర్ఎస్ పార్టీ వల్లనే బీజేపీ సీనియర్ నాయకులు హైదరాబాద్ పలు నియోజకవర్గాల్లో పోటీకి వెనుకంజ వేశారన్నారు. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని, కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందన్నారు.

Also Read:ఉసిరిరసంతో ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -