సీఎంఆర్‌ఎఫ్‌ కు బ్రాడ్‌రిడ్జ్ ఇండియా భారీ విరాళం..

277
Broadridge India

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం తమ వంతు సహాయంగా బ్రాడ్‌రిడ్జ్ ఇండియా సంస్థ 50,00,000 రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. బ్రాడ్‌రిడ్జ్ ఇండియా ఎండి లక్ష్మీకాంత్ వెంకట్రామన్ ఈ రోజు ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ మరియు పోలీసు సిబ్బంది కోసం పేటీఎం, లైఫ్‌బాయ్ సోప్ మరియు యూవీకాన్ (క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్) లక్షకు పైగా సానిటైజర్‌ ఉత్పత్తులను అందించాయి. సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌ను ఈ రోజు కలిశారు.