సీఎంతో బ్రిటీష్ హైకమిషనర్ భేటీ

4
- Advertisement -

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు భారత బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ కో ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు లిండీ కామెరాన్ అంగీకారం తెలిపారు.

తెలంగాణలో తీసురు రాబోతున్న కొత్త విద్యా విధానం డ్రాఫ్ట్ ను బ్రిటీష్ హైకమిషనర్ కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు ట్రైనింగ్ అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు బ్రిటిష్ హైకమిషనర్.

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరారు సీఎం. జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు బ్రిటీష్ హైకమిషనర్.

Also Read:AP:డీఎస్పీ నియామక పత్రాల పంపిణీ వాయిదా

- Advertisement -