- Advertisement -
కరోనా నుండి కోలుకుంటోంది బ్రిటన్. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ఆదేశ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్. ప్రజలు కచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని… ఇప్పటి నుంచి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం మాత్రమే చేయాలని ఎవరినీ అడగదు అని వెల్లడించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గరిష్ఠస్థాయికి చేరి, తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారని బోరిస్ తెలిపారు. బూస్టర్ డోసుల పంపిణీ వేగవంతం చేయడం కారణంగానే.. ఒమిక్రాన్ నుంచి బయటపడగలిగిన తొలి దేశంగా నిలిచిందని బోరిస్ వివరించారు. కోవిడ్ నిబంధనల పట్ల ప్రజల ప్రతిస్పందనను బట్టి.. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేశామని తెలియజేశారు.
- Advertisement -