కంగనా ఎమర్జెన్సీకి బ్రిటన్ ఎంపీ మద్దతు

2
- Advertisement -

బ్రిట‌న్‌లో ఎమ‌ర్జెన్సీ చిత్రం స్క్రీనింగ్‌ను కొందరు అడ్డుకోగా ఆ దేశ ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్ ఖండించారు. భావ స్వేచ్ఛ‌ను అడ్డుకోవ‌డం స‌రికాదు అని యూకే పార్ల‌మెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. త‌న చిత్రానికి బ్రిట‌న్ ఎంపీ మ‌ద్ద‌తు ప‌లికార‌ని, కానీ భార‌తీయ రాజ‌కీయ‌వేత్త‌లు, ఫెమినిస్టులు మౌనంగా ఉన్న‌ట్లు ఆమె ఆరోపించారు.

సుమారు 40 నిమిషాల సినిమా ముగిసిన త‌ర్వాత‌.. మాస్క్‌లు ధ‌రించిన ఖ‌లిస్తానీ మ‌ద్ద‌తుదారులు ఆ ఫిల్మ్ ప్ర‌ద‌ర్శ‌న నిలిపివేశారు. చిత్రాన్ని తిల‌కిస్తున్న ప్రేక్ష‌కుల్ని బెదిరించి బ‌య‌ట‌కు పంపించారు. దీన్ని ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్ త‌ప్పుప‌ట్టారు.

మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జీవిత‌క‌థ ఆధారంగా ఎమ‌ర్జెన్సీ చిత్రాన్ని తీశారు. న‌టి కంగ‌నా ర‌నౌత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ ఫిల్మ్‌లో ఇందిర పాత్ర‌ను కూడా కంగ‌నే పోషించారు. ప్ర‌ధానిగా ఇందిర తీసుకున్న అనేక కీల‌క నిర్ణ‌యాల‌ను చిత్రంలో చూపించారు. కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌నా ప్ర‌తిభ‌ను అత్య‌ద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు. 1971 ఇండో పాక్ వార్‌, దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించాల్సిన ప‌రిస్థితి, ఆ స‌మ‌యంలో విప‌క్ష జ‌న‌తా పార్టీ ఆవిర్భావం, బ్లూ స్టార్ ఆప‌రేష‌న్‌తో పాటు ఇందిర కుమారుడు సంజ‌య్ గాంధీ స‌న్నివేశాలు చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి.

Also Read:లంచాల తెలంగాణ..సీఎంపై రాజాసింగ్ ఫైర్

- Advertisement -