- Advertisement -
బ్రిటన్‌లో తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాని పదవికి లీజ్ ట్రస్ రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా బ్రిటన్ రాజకీయాల్లో ప్రధానుల పనితీరు సరిగా లేనందునే రాజీనామాల పర్వం కొనసాగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకుల అంచనా.
బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత లీజ్‌ట్రస్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కేవలం 45 రోజుల పాటు పదవిలో ఉన్నారు. బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేశారు. బ్రిటన్ ప్రధానుల్లో రెండవ మహిళగా చరిత్రలో నిలిచిన… ఆర్థిక రాజకీయ సంక్షోభం వలన తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే పలువురు మంత్రులు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -