నల్గొండలో బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం..

363
Bus Accident

నల్గొండలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న ఓ బస్సు (ఏపీ 36 ఎక్స్‌ 3654) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లా కేంద్రంలోని చర్లపల్లి కూడలి వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంజిన్‌లో లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. దగ్ధమైన బస్సును గాయత్రి ట్రావెల్స్‌(గుంటూరు)కు చెందినదిగా గుర్తించారు.

Breaking News: Bus Accident in Nalgonda…Breaking News: Bus Accident in Nalgonda..Breaking News: Bus Accident in Nalgonda…