జగన్ యాత్రకు బ్రేక్!

19
- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. నిన్నటితో యాత్ర 20 రోజులు పూర్తి చేసుకోగా ఇవాళ బ్రేక్ ఇచ్చారు.. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించనున్నారు జగన్‌.

ఈ భేటీలో గెలుపు వ్యూహాలు, ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయా లేదా అన్నదానిపై చర్చించనున్నారు జగన్. ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిని మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నారని తెలుస్తోంది. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాగే సోషల్ మీడియా వింగ్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు జగన్. అనంతరం బస్సు యాత్ర రేపు విజయనగరం జిల్లాలో కొనసాగనుంది.

Also Read:మందుబాబులకు షాక్ న్యూస్..

- Advertisement -