Prabhas: ప్రభాస్ ‘ స్పిరిట్ ‘ ఇప్పట్లో లేనట్లే?

21
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ” కల్కి 2898 ఏడి “, మూవీతో పాటు మారుతి డైరెక్షన్ లో ” రాజా సాబ్ ” మూవీని జట్ స్పీడ్ తో కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రభాస్ లిస్ట్ లో స్పిరిట్ మూవీ ఉంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఇటీవల రన్ బీర్ కపూర్ తో రూపొందించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 900 కోట్లు వసూళ్లు చేసిన ఈ మూవీ సందీప్ రెడ్డి వంగా మరోసారి తన సత్తా అందరికీ తెలియజేశాడు. యానిమల్ మూవీ హిట్ కావడంతో ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీ పై భారీగా హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీలో ప్రభాస్ ను పోలీస్ రోల్ లో చూపించబోతున్నట్లు సందీప్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు..

అంతేకాకుండా గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభాస్ ను చూపించబోతున్నట్లు చెప్పి మూవీపై క్రేజ్ ను రెట్టింపు చేశాడు. ఇక స్పిరిట్ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకొల్లబోతున్నాట్లు కూడా సందీప్ గతంలో స్పష్టతనిచ్చాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా స్పిరిట్ మూవీ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ” కల్కి.. “, ” రాజా సాబ్ ” తరువాత హను రాఘవపూడి తో మూవీ చేసేందుకు ప్రభాస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్. అంతే కాకుండా సలార్ పార్ట్ 2 కూడా లైన్ లో ఉండడంతో స్పిరిట్ ప్రాజెక్ట్ మరింత వెనక్కి వెళ్ళే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలోగా యానిమల్ పార్ట్ 2 ను పూర్తి చేసేందుకు సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నట్లు టాక్. మరి స్పిరిట్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

Also Read:తెలంగాణలో గోద్రెజ్ రూ.1000 పెట్టుబడులు

- Advertisement -