కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్!

2
- Advertisement -

ఓ వైపు న్యాయపోరాటం, మరోవైపు ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్‌పై పోరు దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత లేకపోవడం, అనర్హత వేటు వెరసీ కాంగ్రెస్‌లో చేరాలనుకున్న నేతలంతా బ్యాక్‌ స్టెప్‌ వేసే పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు బ్రేక్ పడింది.

మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడం పెద్ద దుమారానికి దారి తీసింది. మూసీ బాధితులకు అండగా ఉండేలా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నిరసనలు చేపట్టింది. మూసీ బాధితులు తెలంగాణ భవన్‌కు క్యూ కడుతుండటంతో కాంగ్రెస్ నేతలు డిఫెన్స్‌లో పడ్డారు. పైకి మూసీ ప్రక్షాళన ఉంటుందని చెబుతున్న లోలోపల మాత్రం మదన పడిపోతున్నారు.

దీనికి తోడు లగచర్ల ఘటనతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. అధికారులపై జరిగిన దాడి ఘటనలో గిరిజన రైతులను అరెస్టు చేసి వారిని చిత్రహింసలకు గురి చేశారని ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసి కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడంలో విజయవంతమైంది బీఆర్ఎస్. దీంతో పార్టీ ఫిరాయింపులను పక్కనపెట్టి ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి తోడు కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమంది తిరిగి గులాబీ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Also Read:Pushpa 2: ‘పుష్ప-2’ ..కిస్సిక్‌ సాంగ్‌

- Advertisement -