బ్రెజిల్ రోడ్డు ప్రమాదంలో 25 మంది మృతి

24
- Advertisement -

బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీ కొనడంతో 25 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు.

లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా – గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రివేళ ప్రమాదం జరిగిందని బ్రెజిల్ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలపగా ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బహియా సివిల్ పోలీసులు తెలిపారు.

Also Read:Ram Temple:రాముడి విగ్రహ ఊరేగింపు రద్దు

- Advertisement -