గజరాజును అదరగొట్టిన దూడ

247
brave baby buffalo chasing off an elephant
- Advertisement -

బ్రెజిల్‌లోని  పరగ్వే సరిహద్దులో అనకొండపై ఆవు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుండగానే తాజాగా మరో వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా గజరాజుని చూస్తే మనుషులే భయపడిపోతారు. ఇక దాని ముందు జంతువులెంత.

కానీ  ఓ దూడ ఏకంగా గజరాజునే భయపెట్టి పారిపోయేలా చేసింది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ జాతీయ పార్కులో చోటుచేసుకుంది ఈ ఘటన. ఓ గేదె, తన దూడతో కలిసి వెళుతుంటే వాటిని అనుసరిస్తూ వెనుకే ఏనుగు వెళ్తొంది. ఏనుగు తమపై దాడి చేసేందుకు వస్తోందని పొరపడిన దూడ దానికి ఎదురు నిలిచింది. దాంతో ఏనుగు పక్కకు తిరిగి వెళ్లిపోయింది. ఈ వీడియోను పార్క్‌లోని ఓ వ్యక్తి ఆన్ లైన్‌లో పోస్ట్ చేయగా తక్కువ సమయంలోనే లక్షకు పైగా లైకులు, కామెంట్లు వచ్చాయి. ఆ వీడియో మీకోసం..

https://youtu.be/wmYkiLRIzQ4

- Advertisement -