సంక్రాంతి కానుకగా జైసింహాతో వచ్చిన నందమూరి బాలకృష్ణ ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మాణులకు సంబంధించిన డైలాగ్‌లు వారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. బ్రహ్మణుల ఔన్నత్యాన్ని,గౌరవాన్ని చాటిచెప్పేలా సన్నివేశాలను తీర్చిదిద్దారని ఆ సంఘం ప్రతినిధులు కొనియాడారు.
గురువారం జై సింహా విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల బ్రహ్మణ సంఘం ప్రతినిధులు బాలయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ …తనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువని… మన దేశంలో రకరకాల మతాలు, కులాలున్నాయి. అన్ని గ్రంథాల్లోని సారాన్ని తెలుసుకొని జీవిత గమనాన్ని సాగిస్తుంటానని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన అరవయ్యో యేట రామానుజాచార్యగా నటిస్తాని తెలిపారు.
బ్రాహ్మణులుగా పుట్టడం పుణ్యఫలం. వాళ్ల గొప్పతనాన్ని చాటి చెప్పేలా మా సినిమాలో సన్నివేశాలున్నాయి. రామానుజాచార్యులు అంతా సమానమే అని చెబుతూ, చాపకూటి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అష్టాక్షరి మంత్రాన్ని కూడా రాసి ప్రచారం చేశారు. ఆయన పాత్రలో నేను నటించబోతున్నానని తెలిపారు.
వైవిధ్యమైన ప్రయత్నాలు చేసిన ప్రతిసారీ నా సినిమాల్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారు ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు తెలిపారు. సమష్టికృషి ఫలితంగానే ‘జై సింహా’ ప్రేక్షకాదరణ పొందుతోంది. ఒక పాత్ర, ఆ పాత్రకున్న ఆత్మ, అందులో లీనమవ్వడమే నటనంటే. నా సినిమాల్లో అన్నీ ఉండాలి. కె.ఎస్.రవికుమార్ ఆలోచనలు కూడా నాలాగే ఉంటాయి. అందుకే ఈ సినిమాని చక్కగా మలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్యకు చెందిన హనుమంతాచార్యులు, తెలంగాణ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు దర్శనం శర్మ, తులసీ శ్రీనివాస్, ప్రభాకర్, చలపతిరావు పాల్గొన్నారు.