కామెడీ పంచండి..మేకర్స్‌కు బ్రహ్మానందం పిలుపు

38
bramhanandam
- Advertisement -

తెలుగు సినిమాల్లో ఆరోగ్యవంతమైన కామెడీ తగ్గిందన్నారు నటుడు బ్రహ్మానందం. తెలుగులో ఉన్నంత మంది కమెడియన్స్‌ ఏ చిత్ర పరిశ్రమలోనూ లేరని…. తెలుగులో సినిమాలు తీసేవాళ్ళు మీ సినిమాల్లో కమెడియన్స్‌ లేకపోయినా పర్వాలేదు కానీ సినిమాలో మాత్రం మంచి కామెడీ ఉంచండని చెప్పారు.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, మెహరీన్, తమన్నా, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా F3. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా రిలీజ్ అయిన రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లను రాబట్టింది.

సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత కూడా ప్రమోషన్స్ కార్యక్రమం నిర్వహించగా వెంకటేష్, వరుణ్ తేజ్, అలీ, అనిల్ రావిపూడిలని ఇంటర్వ్యూ చేశారు బ్రహ్మానందం.ఈ సినిమాలో అందరి కామెడీ టైమింగ్ బాగుంది…. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు నవ్వులు పూయించారన్నారు.

- Advertisement -