బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలివే..జాగ్రత్త!

29
- Advertisement -

నేటి రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. అదేవిధంగా మెదడు సంబంధిత వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రతి పది మందిలో ఒకరు లేదా ఇద్దరు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభ దశను గురించించడం ఎంతో ముఖ్యం. అలా గుర్తించకపోవడం వల్లే ఎన్నో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తలలో తిమ్మిరిగా అనిపించడం, విపరీతమైన తలనొప్పి, మాటలు తడబడటం, ఉన్నపాటుగా కళ్ళు మైకం కమ్మడం.. ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి సంకేతాలే కాబట్టి ఈ లక్షణాలు ఏ మాత్రం కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. .

ముఖ్యంగా ఆయా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉందట. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు.. ఉన్నవారిలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకా మద్యపానం, ధూమపానం చేసే వారిలో కూడా ఈ సమస్యే ఎక్కువే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇంకా ఇంకా అధిక రక్తపోటు ఉన్నవారిలో మెదడు లోపల రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది.

దీని వల్ల చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బ తిని బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. ఇక కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా శరీరంలో మధుమేహం లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. గంటల తరబడి కూర్చొని పని చేసేవారు ప్రతి అరగంటకు ఒకసారి లేచి నడవాలి. అలాగే మెదడుపై తీవ్ర పనిభారం మోపకూడదు. మానసిక రుగ్మతలు, ఆందోళన, ఒత్తిడి వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇలా కనీసపు జాగ్రత్తలు సూచనలు పాటించడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ను కొంతవరకు అడ్డుకోవచ్చు.

Also Read:TSPSC ఛైర్మన్‌..దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -