ఆ సమస్య ఉంటే..బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలే!

53
- Advertisement -

నేటి రోజుల్లో హార్ట్ స్ట్రోక్ సమస్యలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో.. బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. వీటి యొక్క లక్షణాలు సరిగా అంచనా వేయలేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాధాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించడంలో చాలమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అవి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలని గుర్తించే లోపే భారీ మూల్యం చెల్లించుకుంటూ ఉంటారు. అందుకే ఏదైనా సమస్య కొద్దిగా ఉన్నప్పుడే దానిని గుర్తించి సరైన వైద్యం తీసుకోవడం చాలా అవసరం. .

బాడీలో కొన్ని లక్షణాలు అనారోగ్య సమస్యలను ముందుగానే తెలియజేస్తాయి. శరీరంలో ఒకే వైపు చేయి, కాలు వంటి అవయవాలు తిమ్మిర్లకు గురవుతుంటే ఆ లక్షణాలను నిర్లక్షం చేయకూడదు. అవి బ్రెయిన్ స్ట్రోక్ కు సంకేతం కావొచ్చు. ఇంకా మాట్లాడడంలో ఇబ్బంది, ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో అర్థం కాకపోవడం, వంటి లక్షణాలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు సంకేతాలుగానే పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.

 ఇంకా హటాత్తుగా శరీరం బలహీనంగా మారడం, స్పృహ కోల్పోవడం, వికారం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలను కూడా నిర్లక్షం చేయరాదు. బరించలేని తలనొప్పి, మైకం, మూర్ఛ వంటి లక్షణాలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవుతాయి. కాబట్టి వీటిని సాధారణ సమస్యలుగా పరిగణించకుండా ఈ లక్షణాలు తరచూ వేధిస్తుంటే వైద్యుడిని సంప్రధించడం ఉత్తమం. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండడం అవలరచుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయడం కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:Pawan: పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌

- Advertisement -