TTD:లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు

5
- Advertisement -

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 05వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గం.లకు అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్రవరి 24 నుండి మార్చి 05 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా ఆల‌య ప‌రిస‌రాల‌లో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్‌, పుష్పాలంకరణలను చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

24.02.2026

ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8 నుండి 9.00 గంటల మధ్య మీన లగ్నంలో)

రాత్రి – హంసవాహనం,

25.02.2026

ఉదయం – ముత్యపుపందిరి వాహనం

రాత్రి – హనుమంత వాహనం

26.02.2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సింహ వాహనం

27.02.2026

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – పెద్దశేష వాహనం

28.02.2026

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – గజవాహనం

01.03.2026

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – స‌ర్వ‌భూపాల వాహ‌నం(సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు) కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు),

గరుడ వాహనం( రాత్రి 11 నుండి)

02-03-2026

ఉదయం – రథోత్సవం

రాత్రి – ధూళి ఉత్సవం

Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!

03-03-2026

ఉదయం – సూర్యప్రభవాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం (రాత్రి 08.30 నుండి 09.30గం.ల వరకు), పార్వేట ఉత్స‌వం( రాత్రి 09.30 – 10.00 గంటల వరకు), అశ్వ వాహనం (రాత్రి 10.00 నుండి 11.30 గంటల వరకు)

04-03-2026

ఉదయం – వసంతోత్సవం (ఉదయం 7 నుండి 8 గంటల వరకు), చక్రస్నానం (ఉదయం 11.30 గంటలకు)

రాత్రి – ధ్వజావరోహణం. ( రాత్రి 8 గంటలకు)

మార్చి 05వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -