ఆధ్యాత్మిక కేంద్రంగా బ్రహ్మణ పరిషత్:హరీష్ రావు

421
harishrao
- Advertisement -

సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్‌ను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు మాజీమంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన హరీష్‌ పేద బ్రాహ్మణ మహిళల కోసం సహకార సొసైటీ ని ఏర్పాటు చేయాలన్నారు.

పేద బ్రాహ్మణులకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. సీఎం కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ పరిషత్ ను సిద్దిపేటలో నిర్మించారని గుర్తుచేశారు హరీష్. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్‌ని రాష్ట్రంలోనే ఆదర్శ పరిషత్తు గా తీర్చిదిద్దాలన్నారు కేవీ రమణాచారి. ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుల ఆదేశానుసారం పరిషత్ అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తామన్నారు.

- Advertisement -