మ‌న‌వ‌డితో బ్ర‌హ్మీ..

176
Brahmi With His Grandson
- Advertisement -

టాలీవుడ్‌ని త‌న‌దైన ఛ‌రిష్మాతో నాలుగున్న‌ర‌ ద‌శాబ్ధాలుగా ఏక‌ఛ‌త్రాధిప‌త్యంతో ఏల్తున్న ఏకైక స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మీ అలియాస్ బ్ర‌హ్మానందం .. చాలా అరుదైన ఆనంద క్ష‌ణాల్ని ఆస్వాధిస్తున్నారు.

ఆయన తన మనవడు పార్థ(గౌతమ్‌ కుమారుడు)ను ఎత్తుకుని అచ్చ‌టా ముచ్చ‌టా చెబుతున్న ఫోటోని త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

   Brahmi With His Grandson

ముద్దుల మనవడిని చూస్తూ మురిసిపోతున్న బ్ర‌హ్మీ త‌న జీవితంలో అరుదైన క్ష‌ణాల్ని ఆస్వాధిస్తున్నార‌నే అనిపిస్తోంది. ఎఫ్‌బిలో ఉన్న‌ ఈ ఫొటో అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

అప్ప‌ట్లో ఎస్వీఆర్‌-రాజ‌బాబు కాంబినేష‌న్‌లో కీ.శే.దాస‌రి తెర‌కెక్కించిన `తాతా మ‌న‌వ‌డు` బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. మ‌రోసారి అదే టైటిల్‌తో సినిమా తీయాల్సొస్తే.. ఈ తాత‌-మ‌న‌వ‌ళ్ల‌(బ్ర‌హ్మీ-పార్థ‌)నే సంప్ర‌దించాలేమో? ఒరిజినాలిటీకి రియాలిటీ తోడైతే బంప‌ర్ హిట్టే మ‌రి!

- Advertisement -