బ్రహ్మణీ లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారట..!

293
Online News Portal
Brahmani to be the CM of AP?
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు కోడలు.. బాలకృష్ణ కూతురు బ్రహ్మణీ ఏపీకి సీఎం అవుతుందా..? అవుననే అంటున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడి ఆరోగ్యం 2017 ఫిబ్రవరిలో బాగుండదని.. అపుడు సీఎంగా చంద్రబాబు తప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని జ్యోతిష్య పండితుడు తెలిపారు. ఆయన ఇంకేం చెప్పారంటే.. 2014లో చంద్రబాబు నాయుడు కాల సర్ప దోశమున్న రోజున ప్రమాణ స్వీకారం చేశాడని… అలాంటి దోశం ఉన్న సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తే చాలా కష్టాల పాలయ్యే అవకాశాలున్నాయని జ్యోతిష్యుడు తెలిపారు.

Naidu

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జూన్‌ 6. అప్పటి నుండి ఇప్పటి వరకు బాబుకు మంచి జరుగలేదన్నారు. రెండేళ్లుగా అమరావతి రాజధాని అభివృద్ది ముందుకు వెళ్లడం లేదని.. పెట్టుబడి పెడతామంటూ వచ్చిన సంస్థలు వెనక్కి వెళ్లిపోతాయని తాను గతంలోనే చెప్పానని జ్యోతిష్యుడు అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంతా తాను చెప్పినట్టే జరిగిందని స్పష్టం చేశారు.

కొన్ని జాతక సంబంధమైన మార్పుల వలన 2017, ఫిబ్రవరి తరువాత చంద్రబాబు కుటుంబంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు కోడలైన బ్రహ్మణీ ద్వారా వారి కుటుంబంలో విశేషమైన మార్పులు రాబోతున్నాయని చెప్పారు. ఆ మార్పులు బాబు కుటుంబంలో ముసలానికి దారి తీస్తాయని అన్నారు. అంతే కాకుండా నారా లోకేష్‌కు మెదడుకు సంబంధించిన వ్యాధి రాబోతుందని ఆయన తెలిపారు.

naralokeshbramhani

ఇక లోకేష్ ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆ తరువాత స్థానం బ్రహ్మణీదేనని అన్నారు. లోకేష్ బార్య అయిన బ్రహ్మణీ మూలంగా చంద్రబాబు కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఆ సమస్యలు లోకేష్‌కు పదవి ఇచ్చేందుకు కావచ్చు.. లేదా బాలకృష్ణకు పదవి దక్కడంలో బ్రాహ్మిణీ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణ వేరుపడ్డాక… ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని అధికారంలోకి తెచ్చి ఏపీకి సీఎంగా చంద్రబాబు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -