మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో 100% సక్సెస్ రేటుని సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న బ్యానర్ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి రానున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనందం’. హాస్య బ్రహ్మ పద్మశ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ నటించారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పకులుగా డెబ్యూ డైరెక్టర్ ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూనిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతోంది.
‘బ్రహ్మా ఆనందం’ మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. అందులో భాగంగా గురువారం ఈ సినిమా నుంచి ‘ఆనందమాయే..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. శాండిల్య పీసపాటి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ పాటను శ్రీసాయి కిరణ్ రాయగా, మనీషా ఈరబత్తిని, యశ్వంత్ నాగ్ ఆలపించారు. పాటను గమనిస్తే.. ఇది క్యూట్ లవ్ సాంగ్ . ఇందులో హీరోపై తన ప్రేమను హీరోయిన్ అందంగా వివరిస్తుంటే, హీరో మాత్రం తనకు డబ్బు మీదున్న ప్రేమ, అవసరాన్నిపాటగా పాడుకుంటున్నారు. ఇద్దరు భిన్నమైన మనస్తత్వాలున్న వ్యక్తులుగా హీరో, హీరోయిన్ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ నిఖిల్. చక్కటి పదాలు, వినసొంపైన ట్యూన్‌తో పాట హృద్యంగా హత్తుకునేలా ఉంది.
వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందిస్తున్నారు. మితేష్ పర్వతనేని డీవోపీగా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
Also Read:చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలే: జగన్