డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట!

1
- Advertisement -

డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తిరుమలలో తొక్కిసలాట జరిగిందన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. మీడియాతో మాట్లాడిన బీఆర్ నాయుడు.. ఒక సెంటర్‌లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ప్రవేశించడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నదని చెప్పారు.

ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారని, 25 మంది గాయపడ్డారని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. క్షతగాత్రుకు రుయా, స్విమ్స్‌ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని సీఎం చెప్పారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తామన్నారు.

మృతి చెందిన వారిలో విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందింస్తామని చెప్పారు.

Also Read:తిరుపతి ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

- Advertisement -