క్రేజీ ఫిల్మ్ …’బాయ్స్ హాస్టల్’

37
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరేను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు. ‘బేబీ’ టీమ్ బాయ్స్ హాస్టల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

బాయ్స్ హాస్టల్ ట్రైలర్‌ హాస్టల్‌లో ఉంటున్న అబ్బాయిల జీవితాలను ప్రజెంట్ చేసింది. వారు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, అల్లరిగా సరదాగా గడుపుతుంటారు. హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినప్పుడు వారికి పెద్ద సమస్య దురౌతుంది. హాస్టల్‌ కుర్రాళ్లు దీన్ని యాక్సిడెంట్‌గా మార్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారుతుంది. ట్రైలర్ హిలేరియస్మక్రేజీ మూమెంట్స్‌తో నిండిపోయింది. నటీనటులందరూ కొత్తవారే అయినప్పటికీ తమ రియలిస్టిక్ యాక్టింగ్‌తో కథనంలో ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. తరుణ్ భాస్కర్ ప్రత్యేక పాత్రలో కనిపించగా, రిషబ్ శెట్టి, ఇతర ప్రముఖుల ప్రజన్స్ పెద్ద యాడ్-ఆన్. పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ సూపర్ హాట్ గా కనిపించింది.

దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఒక నిర్మాతగా వరుణ్ గౌడ, ప్రజ్వల్ B. P. , అరవింద్ S. కశ్యప్‌లతో కలిసి గుల్‌మోహర్ ఫిల్మ్స్ , వరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. పరంవా పిక్చర్స్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి సమర్పించారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా, బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సురేష్ ఎమ్ ఎడిటర్ . బాయ్స్ హాస్టల్ ఆగస్ట్ 26న విడుదల కానుంది.

Also Read:తమలపాకుతో ఆరోగ్యం…

- Advertisement -