చైనా వస్తువులను బహిష్కరించండి…

157
online news portal
Boycott Chinese goods…

భారతదేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని యోగా గురు రాందేవ్ బాబా పిలుపునిచ్చారు. భారత దేశ సొమ్మును ఆర్జించి….చైనా..పాకిస్థాన్‌కు సహాయపడుతోందని ఆరోపించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వులో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చైనా పాలకులపై సామాజిక ఒత్తిడి తీసుకురావాలన్న లక్ష్యంతోనే చైనా వస్తువులు వాడకూడదన్నారు. నటీ, నటులు తీవ్రవాదులుకాదన్న రాందేవ్‌… హిందీ సినిమాల్లో నటిస్తున్న పాక్‌ నటీనటులకు మనస్సాక్షి లేదన్నారు. పాక్‌ నటులకు డబ్బు, సినిమాలు,బిర్యానీ తినడం గురించే ఆరాట పడుతుంటారని మండిపడ్డారు. ఉరీ ఉగ్రదాడిలో భారత జవాన్లు చనిపోతే పాక్‌ నటులు ఎందుకు ఖండించలేదని నిలదీశారు.

ఇక పాకిస్థాన్‌లో పతంజలి ద్వారా ఆర్జించిన సొమ్మును అక్కడున్న పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాని ఖర్చు పెడుతున్నానని వెల్లడించారు. పంతజలిలో తనకు సింగిల్‌ షేర్‌ కూడా లేదని, నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నాని ఆయన తెలియజేశారు. మోడీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సంతృప్తిగా ఉన్నారా అని రాందేవ్‌ బాబాను ప్రశ్నించగా ………యోగికి సంతోషం, దుఃఖం ఏవీ ఉండవు. ఈరెండింటికి అతీతంగా ఉంటానని తెలిపారు. నరేంద్ర మోడీపై నమ్మకముందని….రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నేనెప్పుడు పదవుల గురించి ఆలోచించలేదని వెల్లడించారు.

online news portal

పతంజలి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. టూత్‌పెస్ట్‌, తేనే, నెయ్యి తదితర పతంజలి ఉత్పత్తులు మార్కెట్లో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఇటీవలె పతంజలి గ్రూప్‌ వస్త్ర రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. యువత వేసుకునే జీన్స్‌ ప్యాంట్లకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకుని విదేశీ బ్రాండ్లతో పోటిని తట్టుకునే విధంగా పతంజలి జీన్స్‌ త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.

online news portal

భారత మార్కెట్లో ఇప్పటికే పతంజలి క్షేత్రస్ధాయిలో ప్రజలకు అందుబాటులోకి రాగా…ఇటీవలె పతంజలి సంస్థ విదేశీ మార్కెట్లపై కూడా కన్నేసింది. మద్యతరగతి పేదలే లక్ష్యంగా వారికి అందుబాటులోకి ఉండేవిధంగా వివిధ రకాల ఉత్పత్తులను పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్,సౌది అరేబియాలలో ప్రవేశ పెట్టింది.ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కొంత ప్రతికూలంగా ఉన్న తర్వాతి కాలంలో తమ ఉత్పత్తులు పెరుగుతున్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాందేవ్‌.