బ్యాంకాక్ లో బోయపాటి-బెల్లంకొండల చిత్రం..!

208
Boyapati Srinu Next Movie with Bellamkonda Sreenivas
- Advertisement -

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది.

Boyapati Srinu Next Movie with Bellamkonda Sreenivas

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. “బ్యాంకాక్ లో 30 రోజులపాటు జరిగిన భారీ షెడ్యూల్ లో హీరోహీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలతోపాటు రెండు పాటలను కూడా తెరకెక్కించడం జరిగింది. ఈ షెడ్యూల్ లో చిత్ర కథానాయకుడు సాయిశ్రీనివాస్ తోపాటు కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ మరియు ముఖ్యపాత్రధారులైన జగపతిబాబు, శరత్ కుమార్ లు పాల్గొన్నారు. సరైనోడు లాంటి సూపర్ సక్సెస్ అనంతరం బోయపాటి మార్క్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రమిది. సాయిశ్రీనివాస్ స్టైలిష్ లుక్ కి మంచి ఆదరణ లభించింది. మా దర్శకుడు బోయపాటి ప్లానింగ్, మా ఆర్టిస్టులు అందించిన సహకారం వల్ల అనుకొన్న సమయంలో బ్యాంకాక్ షెడ్యూల్ ను ఒక్క రోజు గ్యాప్ కూడా లేకుండా పూర్తి చేయగలిగాం” అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!

- Advertisement -