సూర్య‌తో సినిమా చేస్తా- బోయ‌పాటి

105
boyapati
- Advertisement -

సూర్య న‌టించిన‌ యాక్షన్ థ్రిల్లర్ ఇటి (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు). పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10 విడుదల కానుంది.

మ‌రో ముఖ్య అతిథి బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ, రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్సే కాదు మాట‌లు కూడా బాగా చెబుతారని ఈ స్టేజీమీద వారు చెప్పిన మాట‌ల‌బ‌ట్టి అర్థ‌మైంది. సూర్య‌గాద‌రి సినిమాలు ఏ హీరో చేయ‌ని భిన్న‌మైన క‌థ‌ల‌తో చేస్తుంటారు. గ‌జ‌ని నుంచి బైభీమ్ వ‌ర‌కు ఆయ‌న సినిమాలే ఆయ‌న అభిరుచికి నిద‌ర్శ‌నం.మ‌రోవైపు స్వ‌చ్చంధ సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. సూర్య‌గారు ఛారిటీ ద్వారా గుండెజ‌బ్బు వున్న‌చిన్న పిల్ల‌ల‌కు సైతం సాయం చేస్తున్నారు. ఈ ఛారిటీ చేస్తున్న సేవ‌ల వ‌ల్ల సూర్య‌గారి జ‌న‌రేష‌న్ అంతా బాగుండాల‌ని కోరుకుంటున్నా. ఈ ఛారిటీ ద్వారా సేవ‌లు చేయ‌డం అనేది తెలుగులోనూ ముందుగానే మ‌న హీరోలు చేస్తున్నారు. కేన్స‌ర్ ఆసుప‌త్రి ద్వారా బాల‌య్య‌బాబు ఎంతో మంది జీవితాల్లో వెలుగును చూపారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌తోనూ ఎంతో మందిని జీవితాల్లో చిరున‌వ్వును వెలిగించారు.

అందుకే సూర్య‌లాంటి మంచి మ‌న‌సు వున్న‌వారు మ‌న‌కు చాలా అవ‌స‌రం. తెలుగు ప్రేక్ష‌కులు బాష‌తో సంబంధంలేకుండా మంచి సినిమాల‌ను ఏ భాష‌లో వ‌చ్చినా ఆద‌రిస్తారు. సూర్య సినిమా మ‌న సినిమా అని ఫీల‌వుతారు. ర‌జ‌నీకాంత్ త‌ర్వాత సూర్య అంటే మ‌న‌వాడు అని తెలుగు ప్రేక్ష‌కులు ఓన్ చేసుకున్నారు. అలాంటి సూర్య‌గారి నుంచి వ‌స్తున్న ఇ.టి. సినిమా ప్రేక్ష‌కులు ఆద‌రించే సినిమా అవ్వాల‌ని కోరుకుంటున్నాను. బ‌యోపిక్‌లు చేయ‌డం వేరు. బ‌యోపిక్‌ల నుంచి యువ‌త‌కు స్పూర్తి క‌లిగించేలా చిత్రాలు చేయ‌డం గొప్ప విష‌యం. ఆకాశ‌మే నీ హ‌ద్దురా, జైభీమ్ వంటి సినిమాల‌ను అలా చేసి అద్భుతంగా ఆయా పాత్ర‌ల‌ను పండించారు. సూర్య‌తో ఓ సినిమా చేయాల‌నుంది . నాకు టైం కుదిరిన‌ప్పుడు సూర్య‌గారికి వీలు చిక్కిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఓ సినిమా చేస్తాను.. అఖండ‌, పుష్ప‌, భీమ్లానాయ‌క్ తో తెలుగు సినిమా నిండుకుండ‌లా వుంది. అందులో ఇ.టి. కూడా వుండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ, నేను సూర్య‌గారిపితామ‌గ‌న్‌ సినిమా చూసి సూర్య‌కు అభిమానిని అయ్యా. ఆ త‌ర్వాత ప‌దేళ్ళ‌నాడు సూర్య‌గారు నా సినిమాను ఎడిటింగ్‌లో చూసి న‌న్ను కారులో ఎక్కించుకుని నా న‌ట‌న‌పై నాలుగు గంట‌లు క్లాస్ పీకారు. అదే న‌న్ను బ‌ళ్ళాల‌దేవ్, డేనియ‌ల్ శేఖ‌ర్‌ని చేసింది. మా క‌ట్ట‌ప్పతో (స‌త్య‌రాజ్‌)తో ఐదేళ్ళ‌నుంచి ఓ సినిమా చేశాం. ఆయ‌న్నుంచి చాలా విష‌యాలు తెలుసుకున్నా. ద‌ర్శ‌కుడు పాండ్య‌రాజ్‌కు శుభాకాంక్ష‌లు. ఇ.టి. కి మంచి విజ‌యం ద‌క్కాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు. డి.సురేష్‌బాబు మాట్లాడుతూ, ఇ.టి. సినిమా బాగా ఆడాల‌ని కోరుకుంటున్నాను. సూర్య సింగం 4,5,6, అన్ని వ‌స్తాయ‌ని ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తే అనిపిస్తుంది. రామ్ ల‌క్ష్మ‌ణ్‌తోపాటు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.

సినిమాటోగ్ర‌ఫీ ర‌త్న‌వేలు మాట్లాడుతూ, సూర్య‌తోపాటు నా కెరీర్ ఒకేసారి ప్రారంభ‌మైంది. ఇంత‌కుముందు స‌న్నాఫ్ కృష్ష‌న్ సినిమా చేశాను. 20 ఏళ్ళ‌నాడు సూర్యను ఎలా చూశానో ఇప్ప‌టికీ అలానే వున్నారు. సినిమాలోనే కాదు రియ‌ల్ లైప్ హీరో. త‌న ఫౌండేష‌న్‌తో ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇ.టి. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అయినా మంచి సందేశం వుంది. రోబో త‌ర్వాత తెలుగులో ప‌లు సినిమాలు చేశాను.ద‌ర్శ‌కుడు పాండిరాజ్ మంచి సినిమాలు తీస్తారు. ఈ సినిమా షూర్‌గా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, సూర్య‌కు అభిమానులు హైద‌రాబాద్‌లో మంచి స్వాగ‌తం ప‌లికారు. ర‌త్న‌వేలు. పాండ్య‌రాజ్‌తోపాటు అంద‌రు టెక్నీషియ‌న్స్‌కు ఆల్ ది బెస్ట్‌. ఈ మ‌ధ్యే సూర్య న‌టించిన జైభీమ్ ఓటీటీలో ఇర‌గ‌తీసింది. ఆకాశ‌మే నీ హ‌ద్దురా కూడా అలాగే ఆద‌ర‌ణ పొందింది. ఇలా ప్ర‌తి సినిమాను భిన్న‌మైన‌విగా సూర్య చేస్తున్నారు. ఇండియ‌న్ హీరోల‌లో సూర్య‌ది ప్ర‌త్యేక శైలి. క‌థ‌ల ఎంపిక కూడా చ‌క్క‌గా ఎంపిక చేసుకుంటున్నార‌ని తెలిపారు.

స‌త్య‌రాజ్ మాట్లాడుతూ. ఇ.టి. అంటే ఎవ‌ర్ టాలెంట్ సూర్య‌. నాకు రానా తోపాటు సురేష్‌బాబు బెస్ట్ ప్రెండ్ లాంటివాడు. ఇ.టి. సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.రామ్ ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ, మ‌న‌సు అందంగా వుంటే మ‌నిషి అందంగా వుంటార‌ని సూర్య‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్ర‌ముఖ నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా మాట్లాడుతూ, భీమ్లానాయ‌క్‌లో రానా అద్భుతంగా చేశౄడు. అఖండ బోయ‌పాటి మైండ్ బ్లోయింగ్‌. ముంబైలో నెంబ‌ర్‌1 యాక్ష‌న్ డైరెక్ట‌ర్ అని చెబుత‌న్నారు. రాజ‌మౌళి త‌ర్వాత సౌత్ ఇండియ‌న్ ఫిలింస్‌లో తెలుగు సినిమాలు ఒక గౌవ‌రం వుంది. పాండిరాజ్ కుటుంబ సినిమాలు తీస్తారు. ఏషియ‌న్ టీమ్‌, దిల్‌రాజుకు కంగ్రాట్స్ తెలియ‌జేశారు.

- Advertisement -