గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను నాలుగోసారి కలిసి తెరకెక్కిస్తున్న చిత్రం అఖండ 2 – తాండవం. భారీ అంచనాలు, పాజిటివ్ బజ్ మధ్య ఈ సినిమా రేపు పేడ్ ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంయుక్త ప్రధాన పాత్రలో నటిస్తోంది.
సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, దర్శకుడు బోయపాటి శ్రీను X స్పేస్‌లో అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన చిన్న కుమారుడు సినిమాలో చేసిన పాత్రను వెల్లడించారు. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బోయపాటి వర్షిత్ సినిమాలో నటించానని చెప్పినా, వివరాలు వెల్లడించలేదు. కానీ తాజాగా బోయపాటి శ్రీను, తన కుమారుడు భక్త ప్రహ్లాద పాత్రలో నటించాడని చెప్పారు.
ట్రైలర్‌ను గమనిస్తే, ఆ చిన్నారి కనిపించే కొన్ని షాట్లు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాలో పురాణ కథలు ఏ విధంగా భాగమయ్యాయి, ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎలా ఉంటాయనే ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో ఆధి పినిశెట్టి ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందిస్తున్నారు.
Also Read:పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు..హైకోర్టు అసహనం

