బోయపాటి విలన్‌గా ఆ హీరో

409
boyapati next movie vilan
- Advertisement -

బోయపాటి శ్రీను ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్‌ వన్‌ డైరెక్టర్‌ మాస్‌అండ్‌ క్లాస్‌కు పెట్టింది పేరు బోయపాటి. బోయపాటి సినిమాలో విలన్‌లు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ముఖ్యంగా లెజెండ్‌ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా హీరో జగపతి బాబుని విలన్‌గా చేసి అద్భుతమైన కెరీర్‌ ఇచ్చాడు బోయపాటి శ్రీను. సిని ప్రేక్షకులకు విలన్‌ అంటే బోయపాటి సినిమాలోనే చూడాలిరా అనిపించే స్ధాయిలో జగపతి బాబు విలనిజం వుంటుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను తీసిన సరైనోడులో హీరో ఆదిని వైరం ధనుష్‌ క్యారెక్టర్‌లో చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బోయపాటి. హీరో ఆదిని ఈ యాంగిల్‌ కూడా చూపించవచ్చ అనే ఫీలింగ్‌ను ప్రేక్షకులకు కలిగించాడు. ఎప్పుడైతే ఆది లాంటి హీరో విలన్‌ అయ్యాడో ఆ క్యారెక్టర్‌ డెప్త్‌ పెరిగింది. బోయపాటి తీసిన భద్ర, తులసి సినిమాల్లో కూడా విలన్‌లు చాలా ప్రత్యేకంగా ఉంటారు.

boyapati next movie vilan

సరైనోడు సినిమా లో విలన్‌గా ఆది నటించడం వల్ల సినిమా అవుట్‌ లుక్‌ మొత్తం మారిపోయింది. ఇప్పుడు తన కొత్త సినిమాకి ఇదే ఫార్ములా పాటించాలని చూస్తున్నాడు బోయపాటి శ్రీను. బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రాబోతున్న కొత్త సినిమాకి హీరోయిన్‌ గా రకుల్‌ ప్రీత్‌సింగ్‌గా ఎంపికచేశారట. ఈసినిమాకి మిర్యాల రవీందర్‌రెడ్డినిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈసినిమాలోనూ విలన్‌ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉండనుంది. విలన్‌ పాత్రకోసం ప్రస్తుతం బోయపాటి కసరత్తులు చేస్తున్నాడట. సరైనోడు సినిమాలో అల్లుఅర్జున్‌కి బాబాయ్‌గా నటించిన హీరో శ్రీకాంత్‌ ని ప్రస్తుతం ఇప్పుడు తన తీయబోయే సినిమాలో విలన్‌గా చూపించాలని బోయపాటి డిసైండ్‌ అయ్యానట్టు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

boyapati next movie vilan

ఈ సినిమాకి మొదట అర్జున్‌,శరత్‌కుమార్‌లాంటి పేర్లు పరిశీలనకి వచ్చినా శ్రీకాంత్ అయితే ఈ క్యారెక్టర్‌కి సెట్‌ అవుతుందని భావించడట బోయపాటి. హీరో శ్రీకాంత్‌ నెగెటివ్‌ యాంగిల్‌ని ప్రేక్షకులు మహాత్మా సినిమాలో తప్ప మరిఎక్కడ చూడలేదు.

boyapati next movie vilan

అయితే… శ్రీకాంత్‌కూడా విలన్‌ పాత్రలు చేయాలని ఉందని ఈ మధ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు దాంతో పాటు గడ్డంపెంచి లుక్‌ మారుస్తున్నాడట. ఈ క్యారెక్టర్‌ శ్రీకాంత్‌కు అప్పజేప్తే అతని ముచ్చటతో పాటు తాను ఒక కొత్త విలన్‌ని పరిచయం చేసినట్టు అవుతుంది ఫీల్‌అవుతున్నాడట బోయపాటి శ్రీను. ఈ వారం పదిరోజుల్లో విలన్‌పాత్రపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయట.

- Advertisement -