టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా వెలుగు వెలిగిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన ఇక సినిమాలు చేయడని అంతా భావించారు. అయితే రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లోకి ‘ఖైదీ నెం.150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిరంజీవి ఇకపై వరుసగా సినిమాలు చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకున్నారు. చిరంజీవి కూడా ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను అంటూ ప్రకటించాడు.

ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ సినిమా షూటింగులో బిజీగా వున్నారు. ఈ చిత్రం వచ్చే సమ్మర్‌లో విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమా తరువాత చిరు కొరటాల దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతూనే వున్నాయి. కొరటాల తరువాత సినిమాను బోయపాటి శ్రీనుతో చేసే అవకాశం వుందన్నట్టుగా సినీ వర్గాల సమాచారం. చిరు కోసం ఒక విభిన్నమైన కథను రెడీ చేయమని బోయపాటితో చరణ్ చెప్పాడని తెలుస్తోంది. ‘వినయ విధేయ రామ’ విడుదల తరువాత బోయపాటి అందుకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టనున్నట్టు చెప్పుకుంటున్నారు.

