బాక్సింగ్‌ డే టెస్టు…రూట్ వర్సెస్ డుప్లెసిస్

532
england vs southafrica
- Advertisement -

సాధారణంగా బాక్సింగ్ డే టెస్టు అనగానే ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ పోరు అందరికి గుర్తు వస్తుంది. అయితే ఈ సారి రెండు బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసీస్‌తో న్యూజిలాండ్ తలపడనుండగా దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ తలపడనుంది.

దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా ఇంగ్లండ్ తొలిటెస్టుకు సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సెంచురీయన్ వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది. కీలక ఆటగాళ్లు అనారోగ్యంతో సతమతమవుతుండటం ఇంగ్లాండ్‌ని బాధిస్తోంది. పేస్‌ బౌలర్లు స్టువర్ట్‌ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్‌ వోక్స్, స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ ఫ్లూ జ్వరాలతో బాధపడుతుండగా తన తండ్రి అనారోగ్యం కారణంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా ఆడేది అనుమానంగా మారింది.

మరోవైపు సొంతగడ్డపై బలంగా కనబడుతున్న దక్షిణాఫ్రికా తొలిరోజు నుంచే ఇంగ్లండ్‌పై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెస్టుతో రస్సీ వాన్‌డెర్‌ డస్సెన్‌ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయనుండగా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ ఆడే అవకాశముంది. ఇంగ్లండ్ – దక్షిణాఫ్రికా మధ్య నాలుగు టెస్టులు జరగనుండగా రూట్ వర్సెస్ డుప్లెసిస్ మధ్య జరిగే పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచిచూడాలి.

జట్లు అంచనా..

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్,మార్కమ్,జుబెర్ హమ్జా,డుప్లెసిస్,వాండర్ డస్సెన్,క్వింటన్ డికాక్,డ్వైన్ ప్రెటోరియస్,ఫిలాండర్,కేశవ్ మెరాజ్,రబాడా,ఎన్‌రిచ్ నోర్జె.

ఇంగ్లండ్:బర్న్స్,సిల్బీ,జో డెన్లీ,జో రూట్,బెన్ స్టోక్స్,బెయిర్‌ స్టా/పోప్,జోస్ బట్లర్,సామ్ కుర్రాన్,జోఫ్రా అర్చర్,స్టువర్ట్ బ్రాడ్,జేమ్స్ అండర్‌సన్

- Advertisement -