కరోనాను జయించాడు..పుత్రోత్సాహంతో మురిసిపోయాడు

337
Boris Johnson becomes a father again
- Advertisement -

కరోనా వైరస్ నుండి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు గుడ్ న్యూస్. కరోనాను జయించిన బోరిస్ తండ్రయ్యాడు. బోరిస్ గర్ల్ ఫ్రెండ్ క్యారీ సైమండ్స్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆదేశ ప్రధానమంత్రి ప్రతినిధి వెల్లడించారు. లండన్‌లోని హాస్పిట‌ల్‌లో పుట్టిన బేబీ ఆరోగ్యంగా ఉందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

55 ఏళ్ల బోరిస్ జాన్సన్ కు గతేడాది 32 ఏళ్ల తన గ‌ర్ల్‌ఫ్రెండ్ సైమండ్స్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. ప్ర‌ధాని కార్యాల‌యం డౌనింగ్ స్ట్రీట్‌లోకి పెళ్లికాకుండా అడుగుపెట్టిన తొలి జంట వీరిదే కావ‌డం విశేషం.

ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ బారిన పడ్డ జాన్స‌న్‌ హాస్పిట‌ల్లో చికిత్స పొందారు. ఓ దశలో పరిస్ధితి క్షిణించడంతో చావుబ్రతుకుల మధ్య పోరాడి కరోనాను జయించారు. సోమవారమే ప్రధానిగా విధుల్లో చేరిన బోరిస్‌కు నిజంగానే ఇది గుడ్ న్యూస్.

- Advertisement -