బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అఖండ–2’ గురించి తాజాగా ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ బుక్ మై షో యాప్‌లో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అప్‌డేట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. యాప్‌లో చూపించిన వివరాల ప్రకారం, సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందనే సూచనలు కనిపించాయి.
అయితే ఆశ్చర్యకరంగా, సినిమాకు సంబంధించిన నిర్మాతల నుంచి ఏవిధమైన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. నిర్మాణ సంస్థ ఎలాంటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకముందే బుక్ మై షో ఇలాంటి అప్‌డేట్ ఇవ్వడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇది పొరపాటున అప్‌లోడ్ అయ్యిందా? లేక ఇన్నర్ సోర్సెస్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అప్‌డేట్ చేశారా? అనే సందేహాలు పెరుగుతున్నాయి.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అఖండ–2 విడుదల చివరి నిమిషంలో వాయిదా పడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఒక దశలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిసినా, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ పూర్తి కాకపోవడంతో తేదీ ఫైనల్ చేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడీ బుక్ మై షో అప్‌డేట్ కారణంగా, అఖండ–2 విడుదలపై అఫీషియల్ ప్రకటన త్వరలోనే రావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read:BB9:కళ్యాణ్‌పై నోరుజారిన భరణి!

