గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన బొంతు శ్రీదేవి

330
bonthu sridevi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హైదరాబాద్ నగర మేయర్ జన్మదిన సందర్బంగా మేయర్ జీవిత భాగస్వామి బొంతు శ్రీదేవి తన కూతుర్లు కూజిత మరియు ఉషశ్రీతో కలిసి మూడు మొక్కలు నాటారు .

ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది . ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది . హైదరాబాద్ నగరం పూర్తిగా కాంట్రిట్ జంగల్ అయింది . ఇలాంటి మహానగరం లో పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వానికి ఒక సవాల్ . అయినప్పటికీ కేసీఆర్ గారు దూరదృష్టితో అర్బన్ పార్కుల ఏర్పాటు మహానగరం చుట్టూ చేస్తున్నారని తెలిపారు.

భవిష్యత్ తరాలకు మంచి గాలి దొరుకుతుంది .దీనివల్ల వాతావరణం లో వచ్చే మార్పులను సమతుల్యం చేస్తాయి . ఇంకా మన ఇంటిపరిసరాలను , ఇంటిపైన వీలుంతంగా చిన్న చిన్న మొక్కలు పెంచి ఎండా వేడిమి తగ్గించాలి . పచ్చదనం పెంచడం అనేది ఎవరో చేస్తారు అనేదానికంటే ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు .విరివిగా మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అని తెలిపారు. ఈ సందర్బంగా మరో ముగ్గురిని నామినేట్ చేశారు . భారతి విద్యాభవన్ ప్రిన్సిపల్ అరుణ శ్రీ , డైరెక్టర్ రమాదేవి , డీఫ్ఓ మధుసూధన్ , డాక్టర్ ప్రమోద్ ప్రముఖ గుండె నిపుణులు యశోద హాస్పిటల్ గార్లకు ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -