బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.10 వేల కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తంచేశారు మేయర్ బొంతు రామ్మోహన్. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బొంతు రామ్మోహన్..గ్రేటర్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు.గర అభివృద్ధికి ప్రతీ సంవత్సరం కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. బస్తీ దవాఖానాలు 350కి పెంచబోతున్నాం అని…. నగరంలో అక్షరాస్యత పెంచేందుకు కృషిచేస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు నగరంలో 25వేల డబుల్ బెడ్రూం ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 40వేల ఇండ్లు నిర్మాణ చివరి దశలో ఉన్నాయని తెలిపారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని తెలిపారు. గ్రేటర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని.. ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.