గుడ్డ బ్యానర్‌కు జరిమానా ఉండదు….

340
bonthu rammohan
- Advertisement -

గుడ్డ బ్యానర్‌కు జరిమానా ఉండదని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి ఏర్పాట్లపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్ బొంతు రామ్మోహన్‌…రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత గల రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్‌ లక్ష్యం మేరకు హైదరాబాద్‌ నగరంలో ఈనెల 24నుంచి మార్చి 4వ తేదీ వరకు నిరక్షరాస్యులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.

24న ఉదయం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు సర్వే జరుగుతుందని, నగరంలో 24.78లక్షల కుటుంబాలు, 97.97లక్షల జనాభా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిరక్షరాస్యుల వివరాలను నమోదు చేస్తామన్నారు. అలాగే, అదే ఇంట్లో చదువుకున్నవారు ఉంటే వారితో, లేక సమీపంలోని చదువుకున్న వారితో నిరక్షరాస్యులకు విద్యను నేర్పించనున్నట్లు మేయర్‌ వివరించారు.

సర్వే కోసం 150వార్డులను 5404 లొకాలిటీలుగా విభజించినట్లు తెలిపారు. సర్వేకు 8681 మంది ఎన్యుమరేటర్లు అవసరమని చెప్పారు. ప్రతి ఎన్యుమరేటర్‌ పది రోజుల్లో 250 నుంచి 300 గృహాలు సర్వే చేస్తారన్నారు.

- Advertisement -