బాంబు పేలుడుతో మరోసారి పాకిస్థాన్ దద్దరిల్లింది. బాంబు పేలుడులో ఏకంగా 20 మందికి పైగా మృతి చెందారు. క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఇవాళ ఉదయం ఈ పేలుడు సంభవించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.
బలూచిస్థాన్ లోని క్వెట్టా రైల్వే స్టేషన్ నుంచి రైలు పెషావర్‌కు బయల్దేరుతుండగా ఈ పేలుడు సంభవించినట్లు పాకిస్థాన్ అధికారులు తెలిపారు. ఈ పేలుడును ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహ్మద్ బలోచ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Here’s Tweet:
#Breaking: Tragic bomb blast at Quetta Railway Station in Balochistan leaves 21 dead and over 30 injured. Baloch Liberation Army claims responsibility, targeting a Pakistan Army unit in the Jaffer Express. Casualties may rise. #QuettaBlast X in Pakistan #ptm_facilitating_fak pic.twitter.com/sRbyWtlcQB
— Shahbaaz (@ShehbaazKashmir) November 9, 2024
Also Read:TTD:శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ