ఢిల్లీలో బాంబు పేలుడు..

9
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించగా 8 మంది మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్‌ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఐదుకుపైగా వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. సమీపంలోని షాపులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో 8 మంది మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు కారణాన్ని తెలుసుకోనేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద దాడుల కుట్ర నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కొందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

- Advertisement -