బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘వార్’..

665
war
- Advertisement -

బాలీవుడ్‌ హీరోలు హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కి న చిత్రం ‘వార్‌’. అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4వేల థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం నమోదు చేసిన కల్లెక్షన్ల విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు. ఆదివారం పన్నెండో రోజు ఈ సినిమా ఏకంగా రూ 14 కోట్లు రాబట్టి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 271 కోట్లు కలెక్ట్‌ చేసింది.

War movie

రూ 300 కోట్ల క్లబ్‌పై కన్నేసిన వార్‌ మూవీ కబీర్‌సింగ్‌ వసూళ్లను త్వరలో అధిగమించి ఈ ఏడాది భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవనుంది. 300 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరిపోవడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా, ఈ చిత్రంలో వాణీ కపూర్, అశుతోష్ రాణా, అనుప్రియ గోయెంక ముఖ్య పాత్రలో నటించారు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్-శేఖర్ పాటలు స్వరపరచగా.. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం అందించారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్లను కొరియోగ్రఫీ చేశారు.

- Advertisement -