- Advertisement -
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఇంటికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి 9గంటల ప్రాంతంలో బెదరింపు కాల్ వచ్చినట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 30న సల్మాన్‌ను చంపేస్తానని ఫోన్‌లో బెదరించినట్లు వెల్లడించారు.
దీంతో బెదరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. అయితే సల్మాన్‌కు ఇలాంటి బెదరింపులు కొత్తవి కాదు. కాగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి కూడా సల్మాన్‌కు చాలా సార్లు బెదరింపులు వచ్చాయి. 2018లో కూడా విచారణ కోసం కోర్టుకు వచ్చిన బిష్ణోయ్.. కోర్టు ఆవరణలోనే బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవలే సల్మాన్ హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు.
ఇవి కూడా చదవండి…
ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?
Virupaksha Trailer: అదుర్స్
ఉగ్రం..అల్బెలా అల్బెలా సాంగ్ లాంచ్ బై నాని
- Advertisement -