- Advertisement -
బాలీవుడ్లో మరో జంట ఒక్కటవ్వబొతున్న సిద్ద్ కియారా జంటపై బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ పొగడ్తల వర్షం కురిపించింది. ఈ జోడీని చూస్తే చాలా ముచ్చటేస్తోందని తెలిపింది. కంగనా రనౌత్ సిద్ద్ కియాల ఫోటోను ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ…ఈ జోడీ ఎంత చూడముచ్చటగా ఉందో..సినిమా పరిశ్రమలో చాలా అరుదుగా నిజమైన ప్రేమ కనిపిస్తుంది. వాళ్లిద్దరిని చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సిద్ధ్ కియారా ఫిబ్రవరి 6న పెళ్లి జైసల్మీర్‌లో జరగనుంది. కుటుంబసభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారని తెలుస్తోందన్నారు. అయితే వివాహం గురించి సిద్ధ్ కియారాలు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఇవి కూడా చదవండి…
పవన్ లుక్ పై చర్చ
బుల్లితెరపై అదరగొట్టిన కాంతార…
దళపతి 67… లియో
- Advertisement -