ప్రపంచం మొత్తం వెయ్యికళ్ళతో ఎదురు చూసిన ఇండియన్ బిగ్గెస్ట్ మూవీలో నటించి, ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రభాస్ కు అంతటి ఇమేజ్ ని కట్టబెట్టిన ఆ సినిమానే ‘బాహుబలి’. ఈ సినిమాతో ఈ డార్లింగ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి కి ముందు మామూలు హీరోగా ఉన్న ప్రభా..’బాహుబలి’ తర్వాత ప్రపంచ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇప్పటికే బాహుబలి సినిమాతో పాటు ప్రభాస్‌ని కూడా సినీపెద్దలు ప్రశంసించారు. అయితే.. బాలీవుడ్‌లో ఖాన్‌ల వల్ల కాని రికార్డులని ప్రభాస్ సాధించడం నార్త్‌లో హాట్ టాపిక్ ఇప్పుడు అయింది. ప్రత్యేకించి ఒక హిందూ హీరో డామినేషన్‌ని ఒక వర్గం హైలైట్ చేస్తోంది. దీంతో సహజంగానే ఖాన్‌లకి కంటగింపుగా వుందని కొందరు అబిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా ఇంతవరకు బాహుబలి గురించి బాలీవుడ్ టాప్ హీరోలు ఎవరూ స్పందించకపోవడాన్ని బట్టి వారికి ఈ విజయం ఎంత అసూయ కలిగిస్తోందో అర్థమవుతోందని కూడా అంటున్నారు. ఇదిలావుంటే ప్రభాస్‌ని హైలైట్ చేస్తూ మీడియా హంగామా చేయడం బాలీవుడ్‌లో ఖాన్‌ల పక్షమైన వారికి నచ్చడం లేదు. ఖాన్స్ ప్రాపకం కోసం ప్రభాస్‌కి ఈ సక్సెస్‌లో క్రెడిట్ ఇవ్వడానికి వారు ఇష్టపడడం లేదు. ఇది బాహుబలి అనే బ్రాండ్ విజయమే తప్ప హీరోకి సీన్ లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
రాజమౌళికి తప్ప ఈ సక్సెస్ క్రెడిట్ ఎవరికీ దక్కదని పేర్కొంటున్నారు. ఒక దర్శకుడి సక్సెస్ అని ముద్ర వేసేస్తే హీరోల ఈగో హర్ట్ కాదు. అందుకే బాహుబలి విజయంలో ప్రభాస్ పాత్రని చిన్నబుచ్చడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభాస్‌కి నార్త్ ఇండియాలో సరైన పిఆర్
నెట్‌వర్క్ లేకపోవడం కూడా అవతలి వర్గానికి హెల్ప్ అవుతోంది. మామూలుగా ఇలాంటి విజయాల్ని స్టార్లు పూర్తి స్థాయిలో హైజాక్ చేసేస్తారు. కానీ ప్రభాస్ ఆ దిశగా దృష్టి పెట్టకపోవడంతో ఖాన్‌ల వర్గమైన బాలీవుడ్ ప్రముఖులు ప్రభాస్‌ని టార్గెట్ చేస్తున్నారని కొందరి అభిప్రాయం.