ప్రపంచంలో మనుషులంతా ఒకేలా ఉండరు. వారి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండవు. ఇందుకు సెలబ్రిటీలు మినహాయింపు కాదు. ఎంత గొప్ప నటులైనా వారూ మనుషులే. వ్యక్తిగత విషయాలు ఎంత రహస్యంగా ఉంచాలనుకున్నా ఏదో ఒక విధంగా వారి గురించి ఆసక్తికర అంశాలు బయటికొస్తూనే ఉంటాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఆసక్తికర అలవాట్లు విషయాలు తెలుసుకుందామా…
సల్మాన్ ఖాన్: బాలీవుడ్ దబాంగ్ ఖాన్ సల్మాన్‌కి సబ్బులంటే చాలా ఇష్టం. ప్రపంచంలోని అన్ని రకాల సబ్బులు సల్మాన్ దగ్గర ఉంటాయనడంలో సందేహం లేదు. ఎక్కువగా సహజ సిద్ధంగా చేసిన వాటికే ప్రాధాన్యమిస్తారట… బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌కి ఏదన్నా తింటున్నప్పుడు ఎవరన్నా తన ఫొటోలు తీస్తే ఒళ్లుమండిపోతుందట. ఆయనకి ఐస్‌క్రీంలు కూడా నచ్చవు. గ్యాడ్జెట్లు. వీడియో గేమ్స్ అంటే ప్రాణం. ‘మన్నత్’(షారుక్ నివాసం)లో ఈ గ్యాడ్జెట్లకు ఏకంగా ఓ గదినే ఏర్పాటుచేసుకున్నాడు. ఇవే కాదు షారుక్‌కి బూట్లంటే మక్కువ ఎక్కువే. ఎంతగా అంటే.. కేవలం నిద్రపోయేటప్పుడు మాత్రమే బూట్లు తీస్తాడట.
మరి మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌కి పిల్లలే కాదు పాములన్నా ఇష్టమే. అందుకే తన ఇంట్లో ఒక కొండచిలువను పెంచుకుంటోందట. ఇదే కాదు ఇంటిపైన ఓ చిన్న బాత్ టబ్ పెట్టించుకుందట. ఎందుకంటే సుస్మితకి తన ఇంటి మేడపై జలకాలాడటమంటే చాలా ఇష్టమట.
విద్యాబాలన్: విద్యాబాలన్‌కి చీరలన్నా, జుంకీలన్నా ప్రాణం. విద్యా ఎక్కడికైనా వెళ్లినప్పుడు చిన్న దుకాణంలో జుంకీలు కనిపించినా కొనేస్తుంది. అంతేకాదు విద్యా సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటుంది. ఒక్కోసారి వారం రోజుల పాటు తన ఫోన్ చూసుకోకుండా ఉండిపోతుందట. అలా చాలా సార్లు విద్యా హాజరుకావాల్సిన కార్యక్రమాలు మిస్సయిపోయిందట…బాలీవుడ్ భామ సన్నీలియోనీకి శుభ్రత ఎక్కువ. ఎంతగా అంటే.. ఇంట్లో ఉన్నప్పుడు ప్రతీ 15 నిమిషాలకొకసారి కాళ్లు కడుక్కుంటుందట. కుదరకపోతే అందుబాటులో ఉన్న టిష్యూ పేపర్లతో శుభ్రం చేసుకుంటుందట.
అమితాబ్ బచ్చన్: బిగ్‌బి ఓ యాంబీడెక్స్‌ట్రస్. అంటే రెండు చేతులతో అవలీలగా రాసేస్తారు.అంతేకాదు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విదేశాల్లో ఉన్నప్పుడు అమితాబ్.. వారున్న రెండు దేశాల గడియారాలు దగ్గర పెట్టుకుంటారు. అంతేకాదు వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఆయన వద్ద రెండు మూడు మొబైల్ ఫోన్లు ఉంటాయి… బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌కి కాఫీ అంటే చాలా ఇష్టం. షాహిద్ ఎప్పుడు మీడియా కంటపడినా చేతిలో కోల్డ్ కాఫీతోనే కనిపిస్తాడు. రోజుకి పది కప్పుల కాఫీ తాగందే ఉండలేడట.
ఆమిర్ ఖాన్: ఆమిర్‌కి స్నానం చేయడం నచ్చదట. ఈ విషయాన్ని స్వయాన ఆయన భార్య కిరణ్ రావే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం స్నానం చేయరని బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే స్నానం చేస్తారని పేర్కొన్నారు.