ఓటేసిన బాలీవుడ్ ప్రముఖులు..

10
- Advertisement -

ఐదో దశ పోలింగ్‌లో ఓటేసేందుకు బాలీవుడ్ ప్రముఖులు పోటెత్తారు. ఇక 56 ఏళ్లలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు నటుడు అక్షయ్ కుమార్.అలాగే జాన్వీ కపూర్ ‌, రాజ్‌కుమార్‌ రావ్‌, ఐరా ఖాన్‌, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్‌, షాహిద్‌ కపూర్‌,రణ్‌వీర్ కపూర్, దీపికా పదుకొణె తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కులు డేవిడ్ ధావ‌న్‌, నటుడు వ‌రుణ్ ధావ‌న్ ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే షారుక్ ఖాన్‌, చుంకీ పాండే, అనన్యా పాండే సహా ప‌లువురు బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఎన్నికల ప్రచారకర్త సచిన్‌ టెండూల్కర్‌ సైతం ఓటు వేశారు. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -