- Advertisement -
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలయ్యాయి. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడినట్లు తెలుస్తోండగా ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జనవరి 15న ఉదయం ముంబై, బాంద్రాలో ఉన్న సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.బాంద్రా డివిజన్ డీసీపీ సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. దొంగతన ప్రయత్నం రాత్రి 2:30 గంటల సమయంలో జరిగింది. ఇంట్లో ఉన్నవారు అప్రమత్తం కావడంతో దొంగ పారిపోయాడని చెప్పారు. ఈ క్రమంలో సైఫ్ గాయపడ్డారని అయితే తీవ్ర గాయాలు ఏమి కాలేదని తెలిపారు.
Also Read:రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: చంద్ర శేఖర్ గౌడ్
- Advertisement -