‘జై హనుమాన్‌’లో ఆ స్టార్ హీరో

26
- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సూపర్ హీరో మూవీ హనుమాన్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. కాగా ఈ సినిమా నేడు మరో రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఈ చిత్రం హిందీలో ఇప్పటి వరకు రూ.39.59 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. నేడు రూ.40 కోట్ల మార్క్ ను అందుకోనుంది. హనుమాన్ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ‘హనుమాన్‌’ సీక్వెల్ పై ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో కూడా.

అందుకే, ప్రశాంత్ వర్మ ‘హనుమాన్‌’ సీక్వెల్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. ‘జై హనుమాన్‌’లో హనుమంతుడిగా బాలీవుడ్ న‌టుడిని తీసుకోనున్న‌ట్లు ప్ర‌శాంత్ వ‌ర్మ వెల్ల‌డించాడు. ఇందుకు సంబంధించి బాలీవుడ్ హీరోల నుంచి ఆడిషన్స్ కూడా చేస్తున్నట్లు తెలిపాడు. త్వ‌ర‌లోనే హనుమంతుడిగా కనిపించబోయేది ఎవ‌రో ప్ర‌క‌టించనున్న‌ట్లు చెప్పాడు. ఇంతకీ ‘జై హనుమాన్‌’లో హనుమంతుడిగా ఏ బాలీవుడ్ హీరో ఒప్పుకుంటాడో చూడాలి. ఐతే, ప్రశాంత్ వర్మ మనసులో మాత్రం స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ అయితే, హనుమంతుడి పాత్రకు బాగా సెట్ అవుతారని తెలుస్తోంది. పైగా ‘జై హనుమాన్‌’ కి అప్పుడు నార్త్ లో కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. దర్శకుడిగా తనకు కూడా భారీ మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రశాంత్ వర్మ బాలీవుడ్ పై కన్ను వేశాడు. మరి ఈ కుర్ర దర్శకుడికి ఏ బాలీవుడ్ స్టార్ ఓకే చెబుతాడో చూడాలి.

Also Read:దీనజనబాంధవుడిగా కాదంబ‌రి కిర‌ణ్

- Advertisement -