ట్రూ లీడ‌ర్…సీఎం కేసీఆర్ కు సెల్యూట్ః సోనూ సూద్

464
sonusud
- Advertisement -

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన కూలీలు మ‌న రాష్ట్రంలో ప‌నిచేస్తున్నార‌ని వాళ్లంద‌రిని తెలంగాణ స‌ర్కార్ ఆదుకుంటుంద‌ని తెలిపారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా వారీకి 12కీలోల బియ్యంతో పాటు పిండి, 500 చొప్పున న‌గ‌దు అంద‌జేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

రాష్ట్రంలో కూలీలు ఎట్టిపరిస్థితుల్లో ఒక్కరు కూడా ఆకలితో ఉండరాదని, వాళ్లను కూడా ఆదుకుంటామని కేసీఆర్‌ ప్రకటించడంపై తాజాగా బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ స్పందించారు. ట్రూ లీడర్.. శాల్యూట్’ అంటూ సోనూ సూద్ ఓ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ మాట్లాడిన వీడియోను కూడా ట్యాగ్ చేశాడు.

- Advertisement -