బోధన్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

207
shakeel
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకు వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారీన పడగా తాజాగా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

వారం రోజుల క్రితం ఎమ్మెల్యే షకీల్ తండ్రికి కరోనా పాజిటివ్‌ రాగా తాజాగా ఆయన టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 965 కరోనా కేసులు నమోదుకాగా ఐదుగురు మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,741కి చేరగా 3,01,876 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1706 మంది మృతిచెందారు.

- Advertisement -