NBK109..హంటర్ వచ్చేశాడు!

19
- Advertisement -

అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాబీ దర్శఖత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్‌లో ఇది 109వ సినిమా కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తమన్ సంగీతం అందిస్తుండగా విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇక మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లింగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ ఫుల్ డైలాగ్‌లతో అదరగొట్టారు బాలయ్య.

ఇక ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీలో జాయిన్ అయ్యారు బాబీ డియోల్. ఇందుకు సంబంధించిన ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. హంట‌ర్ ఎంట‌ర‌య్యాడు.. మీ చేరిక‌తో మా సినిమాకు మ‌రింత బ‌లం చేకూరిందంటూ ద‌ర్శ‌కుడు బాబీ,నిర్మాత నాగ‌వంశీ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. బాలయ్య సరసన ఊర్వశి రౌటేలా హీరోయిన్‌గా నటిస్తుండగా చాందినీ చౌదరి కీలక పాత్రలో నటిస్తోంది.

Also Read:Gold Rate:లేటెస్ట్ ధరలివే

- Advertisement -