నైజీరియాలో పడవ బోల్తా.. 60 మంది మృతి

4
- Advertisement -

నైజీరియాలో మరో ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడిన ఘటనలో 60 మంది మృతి చెందారు. బోర్గూ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో పడవలో 100 మందికిపైగా ఉన్నట్లు సమాచారం.సుమారు 50 మందిని రక్షించినట్లు అధికారుల వెల్లడించారు.

నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (NSEMA) బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు ఓవర్‌లోడింగ్, చెట్టు కాండంతో ఢీకొనడమే కారణమని తేల్చింది. పడవలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని, వారు డుగ్గా పట్టణానికి వెళ్తున్నారని తెలిపింది. NSEMA డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా ఆరా మాట్లాడుతూ..ఇప్పటివరకు 60 మంది మృతదేహాలు వెలికితీసాం. ఇంకా చాలా మందిని వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పది మందిని తీవ్ర గాయాల పరిస్థితిలో బయటపడేయగలిగామన్నారు.

నైజీరియాలో నదీ తీర ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ముఖ్యంగా మార్చి–అక్టోబర్ వరకు వర్షాకాలంలో నదులు, చెరువులు ఉప్పొంగడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఓవర్‌లోడింగ్, పాత పడవల వాడకం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఆగస్టులోనూ, నైజీరియా వాయువ్యంలోని సొకోటో రాష్ట్రంలో పడవ మునక ఘటనలో 40 మంది గల్లంతయ్యారు, దీని కారణం కూడా ఓవర్‌లోడింగ్ అని అధికారులు తెలిపారు.

Also Read:జీఎస్టీ భారం తగ్గింపు..పేదలకు ఊరట

- Advertisement -