రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!

52
- Advertisement -

నేటి రోజుల్లో చాలామంది బ్లేడ్ లెవెల్స్ తక్కువగా ఉండడంతో రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సగటు మనిషిలో నాలుగున్నర లీటర్ల నుంచి అయిదున్నర లీటర్ల రక్తం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. కానీ చాలా మందిలో నాలుగున్నర లీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. అలా ఉండడం వల్ల బలహీనంగా కనిపించడం, నీరసంగా మారడం, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రోగనిరోధక శక్తి లోపించడం, జుట్టు రాలిపోవడం ఇలా ఎన్నో సమస్యలు చుట్టూముడతాయి. రక్తం తగ్గడం అనే సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే స్త్రీలలో పీరియాడ్స్ కారణంగా వారిలో బ్లేడ్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి శరీరంలో బ్లేడ్ శాతం సమతుల్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. .

రక్త కణాల సంఖ్య మెరుగు పడడానికి సరైన ఆహారాన్ని తినడం చాలా అవసరం. ముఖ్యంగా తినే ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే రక్త కణాల సంఖ్యను వృద్ది చేయడంలో ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దానిమ్మ, ఖర్జూరాలు, బీట్రూట్, క్యారెట్.. వంటి వాటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రక్తం తక్కువగా ఉన్నవారు వీటిని ప్రతిరోజూ తినాలి. వీటితో పాటు మిల్లెట్, నువ్వులు, ఎండు ద్రాక్ష.. వంటి వాటిని కూడా తినడం ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో ఐరన్ తో పాటు, పోలేట్, ఫ్లేవనాయిడ్లు, కాపర్ ఇతరత్రా మూలకాలు చాలానే ఉంటాయి. ఇవన్నీ రక్తకణాల వృద్దిని పెంచడంలో సహాయ పడతాయి. ఇంకా తోటకూర, కూరగాయలు ప్రతి రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రక్తం తక్కువగా ఉన్నవారు పై ఆహార పదార్థాలను తప్పనిసరిగా తినడం వల్ల రక్త వృద్ది మెరుగుపడుతుంది.

Also Read:ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ‘మునగ లడ్డూ’!

- Advertisement -